తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పి. నాగభూషణం

నవపక్షం, మద్నూర్ మండల ప్రతినిధి : తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామానికి చెందిన పి. నాగభూషణం ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. జగన్ మోహన్ రావు ముదిరాజ్ మంగళవారం నాగభూషణానికి నియామక పత్రాన్ని అందజేశారు.   మారుమూల ప్రాంతమైన అంతాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర స్థాయి పదవి దక్కడం పట్ల మద్నూర్ మండలంలోని ముదిరాజ్ సంఘ నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ముదిరాజ్ సంఘం బలోపేతంతో...