బోడుప్పల్ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి సరికాదు — బీఆర్‌ఎస్ 1వ డివిజన్ మాజీ అధ్యక్షుడు దుర్గపు క్రిష్ణ గౌడ్

నవపక్షం, బోడుప్పల్ ప్రతినిధి :  బోడుప్పల్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘటనపై బీఆర్‌ఎస్ 1వ డివిజన్ మాజీ అధ్యక్షుడు దుర్గపు క్రిష్ణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, ఆందోళనలు శాంతియుతంగా నిర్వహించుకోవాల్సిందే తప్ప, రాజకీయ పార్టీ కార్యాలయాల వద్ద ఉద్రిక్తతలకు దారితీసే చర్యలు సమర్థనీయం కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీల అమలుపై ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల తరఫున ప్రశ్నించడం తమ బాధ్యత అని క్రిష్ణ...