మేస్త్రి నుంచి డాక్టరేట్ వరకు… స్ఫూర్తిదాయక ప్రస్థానం
నవపక్షం, ఉస్మానియా యూనివర్సిటీ ప్రతినిధి : మేస్త్రిగా జీవన ప్రయాణాన్ని ప్రారంభించి, రాజనీతి శాస్త్రంలో డాక్టరేట్ సాధించిన డా. వలిగొండ నరసింహ ప్రస్థానం కష్టాలను అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న స్ఫూర్తిదాయక కథనం. జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ, స్వయంకృషి, పట్టుదలతో తన భవిష్యత్తును తానే నిర్మించుకున్న వ్యక్తిగా డా. వలిగొండ నరసింహ నిలిచారు. చిన్ననాటి నుంచే తల్లి ప్రేమకు దూరమైన ఆయనకు, తండ్రి అండగా నిలిచారు. అయితే ఇటీవల తండ్రిని కూడా కోల్పోవడంతో ఆయన జీవితంలో మరో విషాదం చోటుచేసుకుంది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని...