అప్పు.. బంధాల మధ్య కనిపించని గీత!
నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 09; “కాస్త డబ్బు అవసరం ఉంది.. సాయం చేస్తావా?” ఈ మాట మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మన చెవిన పడే ఉంటుంది. అడిగేవాడు స్నేహితుడైనా కావచ్చు, బంధువైనా కావచ్చు, మనకు ఎంతో దగ్గరైన వ్యక్తైనా కావచ్చు. ఆ మాట వినగానే ముందుగా గుర్తొచ్చేది అతని అవసరం.. ఆ తర్వాతే మన పరిస్థితి. “మనవాడే కదా.. అవసరంలో ఉన్నప్పుడు ఆదుకోకపోతే ఇంకెందుకు ఈ బంధం?” అనే ఆలోచనతో మన దగ్గర ఉన్నదాంట్లో కొంత తీసి ఇస్తాం. నిజానికి ఆ సమయంలో...