ఫోటోగ్రాఫర్ అశోక్ అనుమానాస్పద మృతి

నవపక్షం, నెల్లికుదురు మండల ప్రతినిధి : నెల్లికుదురు మండలం నల్గుట్ల తండాకు చెందిన వాకోడోతు అశోక్ గత ఏడాది కాలంగా హన్మకొండలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ఓ శుభకార్యానికి ఫొటోలు తీసేందుకు వెళ్లిన అశోక్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అశోక్ కోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా, గురువారం ఆరెపల్లి సమీపంలోని చెట్ల పొదల్లో బైక్‌తో పాటు అతడి మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై గాయాల గుర్తులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటూ, అశోక్ మృతిపై అనుమానాలు...