పంటల నమోదు వివరాలను సేకరిస్తున్న AEO సౌమ్య
నవపక్షం, మద్నూర్ మండల ప్రతినిధి : వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మద్నూర్ మండలం ఆవల్‌గావ్ గ్రామంలో పంటల నమోదు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) సౌమ్య గ్రామంలో రైతులతో మమేకమై, ప్రతి పొలంలో సాగు చేస్తున్న పంటల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేస్తున్నారు. రైతులు తమ భూముల్లో సాగు చేస్తున్న పంటల వివరాలను ప్రభుత్వ రికార్డుల్లో పక్కాగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, రాయితీలు, పంట నష్టపరిహారం తదితర ప్రయోజనాలు అందించేందుకు ఈ...