అంతపూర్‌లో ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు
నవపక్షం, మద్నూర్ మండల ప్రతినిధి: తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పొలాల అమావాస్య (కాడెద్దుల పండుగ) వేడుకలను అంతపూర్ గ్రామంలో గ్రామస్థులు ఘనంగా, వైభవంగా నిర్వహించారు. వ్యవసాయంలో అన్నదాతలకు అండగా నిలిచే ఎద్దుల పట్ల కృతజ్ఞతను చాటుకుంటూ గ్రామస్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అంతపూర్ గ్రామ BRS పార్టీ అధ్యక్షులు వాగ్మారే మారుతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ పెద్దలు, రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. ఆధునిక కాలంలో...