కంది పంటపై పొలంబడి కార్యక్రమం
నవపక్షం, నాంపల్లి, సెప్టెంబర్ 10: నాంపల్లి మండలంలోని దేవత్‌పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ–ATMA ఆధ్వర్యంలో కంది పంటపై పొలంబడి (Farm School) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు కంది పంట సాగులో చేపట్టాల్సిన ఆధునిక యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణ, అధిక దిగుబడుల సాధనపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. రైతులు నాణ్యమైన విత్తనాల ఎంపిక, సరైన విత్తే సమయం, మొక్కల సాంద్రత, కలుపు యాజమాన్యం, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం వంటి అంశాలపై శాస్త్రీయ పద్ధతులను పాటించాలని సూచించారు. కంది...