అక్రమంగా తరలిస్తున్న 324 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత

నవపక్షం, యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి : జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యం అక్రమ రవాణా, అక్రమ నిల్వలు మరియు దుర్వినియోగంపై యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాజపేట పోలీస్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లైస్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో రాజపేట మండలం సింగారం గ్రామం వద్ద పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానించిన లారీని అదుపులోకి తీసుకున్నారు. లారీని తనిఖీ చేయగా...