నర్సింగ్ భట్ల చేనేత కుటుంబానికి చెందిన ఆడబిడ్డకు డాక్టరేట్
నవపక్షం, నాంపల్లి, సెప్టెంబర్ 11: నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించి, చీరలు నేస్తూనే విద్యాభ్యాసాన్ని కొనసాగించిన నర్సింగ్ భట్ల గ్రామానికి చెందిన వల్లకిర్తి జానకి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా సాధించి తన గ్రామానికి, కుటుంబానికి గర్వకారణంగా నిలిచారు. నర్సింగ్ భట్ల గ్రామానికి చెందిన నిరుపేద చేనేత దంపతులు వల్లకిర్తి కొండయ్య, లక్ష్మమ్మల కుమార్తె అయిన జానకి, గట్లమల్లేపల్లికి చెందిన వింజమూరి శంకరయ్యను వివాహం చేసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ (జియాలజీ) పూర్తి చేసిన ఆమె, అనంతరం పరిశోధనలో ప్రవేశించారు....