తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

నవపక్షం, దేవరకొండ, సెప్టెంబర్ 11: దేవరకొండ మండలం పెంచికల్‌పహాడ్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం ఫ్రెషర్స్ డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. ఆశీర్వాదం, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నూతనంగా పాఠశాలలో చేరిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికారు. వారి ప్రతిభను ప్రోత్సహించే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాటలు, నృత్యాలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు....