కార్తీక్ మరిన్ని విజయాలు సాధించాలి: సోదరి కళ్యాణి

నవపక్షం, గజ్వేల్ ప్రతినిధి : రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన తన తమ్ముడు కార్తీక్ కబడ్డీని కేవలం ఆటగా కాకుండా తన ఇష్టంగా భావించి ఎంతో ఆసక్తితో ఆడుతున్నాడని సోదరి కళ్యాణి తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ప్రతిభ కనబరిచి ఉత్తమ క్రీడాకారుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్తీక్ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు సలేంద్ర వెంకటేష్–మమతతో పాటు సలేంద్ర సుగుణ–పర్వతాలు, సలేంద్ర లక్ష్మి–అబ్బయ్య, కళ్యాణి, పూజ, సంజన, అశ్శు సంతోషం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.