తెలంగాణలో అధిక జనాభా కలిగిన యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలి – కాడవేన రాకేష్ యాదవ్
నవపక్షం, భూపాలపల్లి, సెప్టెంబర్ 12 : సామాజిక న్యాయంలో భాగంగా యాదవులకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి, తెలంగాణ రాష్ట్రంలో యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ, రాజకీయ ప్రాతినిధ్యం, అధికార భాగస్వామ్యంలో తమకు తగిన స్థానం దక్కడం లేదని జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి భూపాలపల్లి జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాడవేన రాకేష్ యాదవ్ అన్నారు. యాదవులు రాష్ట్ర అభివృద్ధిలో తను వంతు పాత్ర పోషిస్తున్నారని, పశుపోషణ, వ్యవసాయం, పాల ఉత్పత్తి వంటి రంగాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా...