తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మోటపోతుల రమేష్ గౌడ్ నియామకం
నవపక్షం, హైదరాబాద్: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఓయూ విద్యార్థి నేత, జయశంకర్ జిల్లా గోరి కొత్తపల్లి మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన మోటపోతుల రమేష్ గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రామచంద్ర రావు చేతుల మీదుగా రమేష్ గౌడ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. నియామక పత్రాన్ని స్వీకరించిన అనంతరం మోటపోతుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అప్పగించిన...