పాన్ బ్రోకర్లు, జ్యువెలర్స్ చట్టాలు పాటించాలి
నవపక్షం, తెలంగాణ బ్యూరో : బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి అత్యవసర అవసరాలకు రుణం తీసుకోవడం మన సమాజంలో సాధారణంగా కనిపించే ఆర్థిక వ్యవహారం. అయితే కొన్ని సందర్భాల్లో తాకట్టు పెట్టిన బంగారం తిరిగి ఇవ్వకపోవడం, సరైన రసీదులు ఇవ్వకపోవడం వంటి సమస్యలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు, పాన్ బ్రోకర్లు, జ్యువెలరీ వ్యాపారులు పాటించాల్సిన చట్టాలు, నిబంధనలపై అవగాహన కలిగి ఉండటం అవసరమని మధుబాబు చికిలే పేర్కొన్నారు. పాన్ బ్రోకర్ అంటే ఎవరు? బంగారం,...