రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సలేంద్ర కార్తీక్ ఎంపిక
నవపక్షం, గజ్వేల్, సెప్టెంబర్ 12: గజ్వేల్ వేదికగా నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ ఎంపికల్లో జగదేవపూర్ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన సలేంద్ర కార్తీక్ అత్యద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. సలేంద్ర వెంకటేశ్, మమత దంపతుల కుమారుడైన కార్తీక్ చిన్ననాటి నుంచే కబడ్డీపై ఆసక్తి పెంచుకుని, ఆటలో చురుకుదనం, నైపుణ్యం, అంకితభావంతో రాణిస్తున్నాడు. జిల్లాస్థాయి ఎంపికల్లో ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఇప్పటికే పలు కబడ్డీ పోటీల్లో విజేతగా నిలిచి టోఫీలు సైతం అందుకున్నాడు. గ్రామానికి గర్వకారణం సలేంద్ర...