స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

నవపక్షం, నాంపల్లి, సెప్టెంబర్ 11: నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలను ఎంఈఓ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు కూడా విద్యార్థుల్లో ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. ప్రతి సంవత్సరం మండల స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు...