వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన సర్పంచ్
దమ్మపేట,నవ పక్షం,జిల్లా ప్రతినిధి :- మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, వైస్ సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావులు వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పగడాల రమాదేవి మాట్లాడుతూ మట్టితో చేసిన వినాయక ప్రతిమలను పూజించడం వల్ల పర్యావరణానికి, సమాజానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) తో చేసిన విగ్రహాలు నీటిలో కరగడానికి చాలా సమయం పడుతుందని, మట్టి విగ్రహాలు నీటిలో వేగంగా, సహజంగా...