ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ జన బాట

  నవపక్షం, నిజాంపేట్ ప్రతినిధి : బీజేపీ నిజాంపేట్ సర్కిల్ ఆధ్వర్యంలో, జిల్లా అధికార ప్రతినిధి రచ్చ చక్రధర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “బీజేపీ జన బాట” కార్యక్రమం మధురానగర్ కమాన్ నుంచి ప్రశాంతి హిల్స్ మీదుగా ఇంద్రన్న కాలనీ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా స్థానికులు రహదారుల గుంతలు, అనవసర స్పీడ్ బ్రేకర్లు, డ్రైనేజీ పొంగిపొర్లడం, చెత్తాచెదారం తదితర సమస్యలను బీజేపీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే కాలనీ వాసులతో...