డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్
నవపక్షం, యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ కుటుంబ సమేతంగా భువనగిరి డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జిల్లాలోని పోలీసు సిబ్బంది తమ కుటుంబాలతో కలిసి పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని,...