ఎల్‌నినో ప్రభావంతో మూగబోయిన గణప సముద్రం
ఘనపురం, నవపక్షం – ఘనపూర్ ప్రతినిధి: కాకతీయుల కాలం నాటి చారిత్రక గణప సముద్రం ప్రస్తుతం వెలవెలబోతోంది. ఈ సమయానికి నిండుకుండలా ఉండాల్సిన చెరువు వర్షాభావ పరిస్థితులతో ఆశించిన స్థాయిలో నీటిని సంతరించుకోలేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో చెరువు మత్తడి మూగబోయింది. ఒకప్పుడు గణప సముద్రం నిండిన వేళ మత్తడి నుంచి ఉరకలెత్తే జలధారలు మరో బొగత జలపాతాన్ని తలపించేవి. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో మత్తడి పరిసర ప్రాంతాలు పర్యాటకులను సైతం ఆకట్టుకునేవి. ప్రస్తుతం ఆ దృశ్యాలు కనుమరుగై మత్తడి...