ఆవుపై కొలువుదీరిన గణపతి.. భక్తులను ఆకట్టుకుంటున్న ప్రత్యేక విగ్రహం

నవపక్షం, ఘనపూర్ ప్రతినిధి :  వినాయక చవితి సందర్భంగా ఘనపూర్‌లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆవుపై కొలువుదీరిన గణపతి విగ్రహాన్ని నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. వినూత్న రూపంలో గణపతి దర్శనమిస్తుండటంతో స్థానికులు, భక్తులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తూ గణనాథుడిని కొలుస్తున్నారు. విగ్రహాన్ని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. చిన్నారులు, యువత ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు...