కొండభీమనపల్లిలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
నవపక్షం, దేవరకొండ, సెప్టెంబర్ 14: దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామంలోని హనుమాన్ గుడి వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా కొనసాగాలని, గ్రామ ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి ఏడుకొండలు, పగిళ్ల...