గ్రావెల్ పోశారు.. రోడ్డు వేయడం మరిచారు
నవపక్షం, దమ్మపేట, నవపక్షం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నల్లివారిగూడెం మెయిన్ రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణం కోసం గ్రావెల్ పోసినప్పటికీ, ఆ తర్వాత రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో రహదారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి మొత్తం గ్రావెల్‌తో ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామం నుంచి వైద్య అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే...