అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
దమ్మపేట, నవపక్షం ప్రతినిధి : వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, సంతోషంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆకాంక్షించారు. వినాయక మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మండపాల ఏర్పాటు సమయంలో విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు, యువత విద్యుత్ పరికరాల సమీపంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు....