తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చేవెళ్లలో భారీ బైక్ ర్యాలీ
నవపక్షం, మొయినాబాద్ మండల ప్రతినిధి: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ మొయినాబాద్ మున్సిపల్ అధ్యక్షుడు మాదాపురం శ్రీకాంత్ తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బీజేపీ నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, యువత, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవం చారిత్రక...