ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

నవపక్షం, నాంపల్లి, సెప్టెంబర్ 15: నాంపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (National Mission on Natural Farming – NMNF) పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.   ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రకృతి వ్యవసాయం ముఖ్య ఉద్దేశాలు, సూత్రాలు, ప్రయోజనాలను రైతులకు వివరించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గిస్తూ, స్థానికంగా లభించే వనరులను ఉపయోగించుకుని తక్కువ పెట్టుబడితో పర్యావరణహితంగా, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో...