ప్రజాస్వామ్యం ఓటు హక్కుకే పరిమితం కాదు – ప్రతి పౌరుడి బాధ్యతతోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రజాస్వామ్యం అనేది కేవలం ఓటు వేసే హక్కు మాత్రమే కాదని, ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, జవాబుదారీతనం, మానవ హక్కులకు పునాది వేసే జీవన విధానమని ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 2007లో తీర్మానం ద్వారా సెప్టెంబర్ 15ను...