వినాయక మండపాలను సందర్శించిన మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్
నవపక్షం, ఘట్కేసర్ ప్రతినిధి : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ డివిజన్‌లో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని నిర్వాహకులకు...