ఏబ్బనూర్ లో గల్లీ గల్లీనా వెలసిన గణనాథులు భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు.

నవపక్షం, వికారాబాద్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, ధరూర్ మండలం, ఏబ్బనూర్ గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామంలో గల్లీ గల్లీనా గణేష్ మండపాలు వెలసి భక్తి శోభ సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా గ్రామంలోని శ్రీ ఆంజనేయ శివాలయ దేవాలయంలో వెలసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్, ధరూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ళ శ్రీకాంత్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పట్లోళ్ళ శ్రీకాంత్...