గణపతి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి – వేముల పుష్ప

నవపక్షం, నకిరేకల్ నియోజకవర్గ ప్రతినిధి : శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామంలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాన్ని ప్రజా గాయిని ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ వేముల పుష్ప దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, భక్తులకు గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని వేముల...