రసూల్‌పూర్‌లో ఉచిత వైద్య శిబిరం విజయవంతం

నవపక్షం, నల్లగొండ మండల ప్రతినిధి : నల్లగొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో తులసి హాస్పిటల్స్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందించడంతో పాటు వైద్య సలహాలు అందించారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుండబోయిన వెంకన్న, ఉపసర్పంచ్ రొయ్య బద్ద్రి,...