కొంపల్లిలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు
నవపక్షం, మునుగోడు ప్రతినిధి : మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో కొంపల్లి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువసేన యూత్ గణపతి వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వీరమళ్ల వెంకటయ్య–లక్ష్మి దంపతులు, నాగరాజు–స్వాతి దంపతులు గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను గ్రామ ప్రజలు, యువత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ...