అంకిరెడ్డిగూడెంలో పోలీసు అవగాహన సదస్సు

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 16: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రచ్చబండ (పాత గ్రామపంచాయతీ) ఆవరణలో గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ మరియు ఎస్‌ఐ నర్సిరెడ్డి హాజరై గ్రామ ప్రజలకు, ముఖ్యంగా యువతకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ జి. మన్మధ కుమార్ మాట్లాడుతూ, అంకిరెడ్డిగూడెం వంటి చిన్న గ్రామంలో ఇంత పెద్ద...