నిరుపేద అనాథ వ్యక్తి అంత్యక్రియలకు దమ్మపేట సర్పంచ్ ఆర్థిక సహాయం
దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి :- దమ్మపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపేటలో నిరుపేద, అనాథ వ్యక్తి మృతి చెందడంతో మానవతా దృక్పథంతో పలువురు ముందుకు వచ్చి అండగా నిలిచారు. ఈ విషయం తెలుసుకున్న దమ్మపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ మానవతా దృక్పథంతో స్పందించి, ఆ నిరుపేద అనాథ వ్యక్తి అంత్యక్రియల కోసం రూ.5,000 విలువైన దహన ఖర్చులకు సహాయం అందించారు. ఆపద సమయంలో అండగా నిలిచి, అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా సహకరించిన సర్పంచ్ సేవను స్థానికులు అభినందించారు. నిరుపేద కుటుంబాలకు అండగా...