వర్షానికి ఇల్లు కూలి నిరాశ్రయులైన నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి
నవపక్షం, బచ్చన్నపేట మండల ప్రతినిధి : ఇటీవల కురిసిన భారీ వర్షానికి బసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పుప్పాల పద్మ, భర్త రాములు కుటుంబానికి చెందిన ఇల్లు కూలిపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో కుటుంబానికి ప్రస్తుతం సురక్షితమైన నివాసం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో సొంతంగా ఇల్లు నిర్మించుకునే పరిస్థితి లేకపోవడంతో వారి ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి. అదేవిధంగా కుటుంబంలోని కుమారుడి మానసిక పరిస్థితి కూడా సరిగా లేకపోవడంతో కుటుంబ పరిస్థితి...