బాలయ్యపల్లె అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం
నవపక్షం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి : బాలయ్యపల్లె అంగన్వాడీ సెంటర్‌లో పోషణ మాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ తోట్ల తిరుపతి యాదవ్, ఉప సర్పంచ్ పిండి ప్రభాకర్ యాదవ్, వార్డు మెంబర్ తోట్ల అశోక్ యాదవ్, పంచాయతీ సెక్రటరీ వేల్పుల సరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ స్వప్న, ఆయా స్వప్న ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు, కిశోర బాలికలు, గ్రామ పెద్దలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా చిరుధాన్యాల ప్రాధాన్యత, ఆకుకూరలలో...