భాగ్యనగర్ జిల్లా బీజేవైఎం ఇన్‌చార్జిగా చింతకాయల ఝాన్సీ నియామకం
నవపక్షం, భాగ్యనగర్ జిల్లా ప్రతినిధి : భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) భాగ్యనగర్ జిల్లా ఇన్‌చార్జిగా చింతకాయల ఝాన్సీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా చింతకాయల ఝాన్సీ మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతను అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండేకు ధన్యవాదాలు తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అంకితభావంతో పనిచేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తానని చింతకాయల ఝాన్సీ...