గణేష్ చందా డబ్బులతో బాలలకు పరీక్షా సామగ్రి పంపిణీ

నవపక్షం, గాజులరామారం డివిజన్ ప్రతినిధి :  శ్రీరామ్ నగర్‌లో బాలల వానర సైన్యం ఆధ్వర్యంలో వినూత్న సేవా కార్యక్రమం నిర్వహించారు. గల్లీలోని బాలలు గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సేకరించిన చందా డబ్బులను సద్వినియోగం చేస్తూ విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా గల్లీలోని బాలలందరికీ పరీక్ష కిట్లు, ఎగ్జామ్ ప్యాడ్, పెన్, పెన్సిల్, షార్పెనర్ తదితర సామగ్రిని పంపిణీ చేశారు. పండుగ సందర్భంగా సేకరించిన చందా డబ్బులను విద్యార్థుల చదువుకు ఉపయోగపడే విధంగా వినియోగించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో...