పద్మనగర్ కాలనీలో ఘనంగా వినాయక ఉత్సవాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవపక్షం, నల్లగొండ, సెప్టెంబర్ 17: నల్లగొండ పట్టణంలోని పద్మనగర్ కాలనీలో విఘ్నేశ్వర యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం నల్లగొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భూపాల్‌రెడ్డి పాల్గొని భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నవరాత్రి...