మల్లపురాజుపల్లిలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు

నవపక్షం, నాంపల్లి, సెప్టెంబర్ 17: నాంపల్లి మండలంలోని మల్లపురాజుపల్లి గ్రామంలో శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అరెగంటి నరసింహ–అంజమ్మ దంపతులు, జగన్ గౌడ్–శిరీష దంపతులు గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను గ్రామ ప్రజలు, యువత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. ఉత్సవాల...