మిర్యాలగూడ 19వ వార్డులో వినాయక మండపాలకు ‘బి.ఎల్.ఆర్. కానుక’
నవపక్షం, మిర్యాలగూడ ప్రతినిధి : మిర్యాలగూడ పట్టణంలోని 19వ వార్డులో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలకు ‘బి.ఎల్.ఆర్. కానుక’ పేరుతో రూ.5,116 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకుడు దేశిడి శేఖర్ రెడ్డి పాల్గొని వినాయక మండపాల నిర్వాహకులకు ఈ కానుకను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వినాయక మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.