నీరు కనిపించడానికి స్వచ్ఛంగా ఉండటం సరిపోదు – శాస్త్రీయ పరీక్షలతోనే భద్రత నిర్ధారణ
నవపక్షం, హైదరాబాద్ బ్యూరో : ప్రపంచ జల పర్యవేక్షణ దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడు తన పరిసరాల్లోని నదులు, చెరువులు, సరస్సులు, వాగులు, భూగర్భ జలాల నాణ్యతను పరిశీలించాలని మధుబాబు చికిలే, స్కిలోక్రాట్, జాతీయ డైరెక్టర్, ప్రపంచ మానవ హక్కుల సమితి పిలుపునిచ్చారు. నీటి కాలుష్యం వల్ల సూక్ష్మజీవులు, రసాయనాలు, భారీ లోహాలు వంటి ప్రమాదకర పదార్థాలు ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల pH, కరిగిన ఆక్సిజన్ (DO), ఉష్ణోగ్రత, TDS, టర్బిడిటీ వంటి ప్రాథమిక ప్రమాణాలను క్రమం తప్పకుండా...