మధురానగర్ కమాన్ వద్ద ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
నవపక్షం, కుతుబుల్లాపూర్ నియోజవర్గ ప్రతినిధి : మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి మండలం, నిజాంపేట్ సర్కిల్, ప్రగతి నగర్ డివిజన్ లోని మధురానగర్ కమాన్ వద్ద తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు రచ్చ చక్రధర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం రచ్చ చక్రధర్ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది. నిజాం నియంత పాలన...