శాలిగౌరారం మండల ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడిగా అరుణ్ కుమార్
నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి: శాలిగౌరారం మండల ఎమ్మార్పీఎస్ (MRPS) మండల ఉపాధ్యక్షుడిగా గుండె అరుణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా గుండె అరుణ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ఎమ్మార్పీఎస్ నాయకత్వానికి, తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ ఎమ్మార్పీఎస్ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.