మేడ్చల్ రూరల్ జిల్లా BJYM ఇన్‌చార్జిగా బండి దీక్షిత్
నవపక్షం, రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 18: భారతీయ జనతా పార్టీ యువమోర్చా (BJYM) మేడ్చల్ రూరల్ జిల్లా ఇన్‌చార్జిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది, యువ నాయకుడు బండి దీక్షిత్ నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు సూచనల మేరకు BJYM రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండె ఈ నియామకాన్ని చేపట్టారు. విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై చురుకుగా స్పందించిన బండి దీక్షిత్ గత 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతూ విద్యార్థి, యువజన, సామాజిక అంశాలపై తనదైన...