గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు భద్ర బోయిన సైదులు

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి ;  సూర్యాపేట పట్టణంలోని 17వ వార్డు చింతలచెరువులో విజ్ఞహార్థ యూత్ కమిటీ ఆహ్వానం మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు భద్ర బోయిన సైదులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తున్న విజ్ఞహార్థ యూత్ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో...