ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా అన్నప్రసాద వితరణ
నవపక్షం,శాలిగౌరారం మండల ప్రతినిధి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తోట వినోద్ కుమార్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,తుంగతుర్తి బిజెపి నియోజకవర్గ ఇంచార్జ్ కడియం రామచంద్రయ్య ముఖ్యఅతిథిగా విచ్చేసి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా దాదాపు 1000 మంది భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమం లో కడియం...