విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

  నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :  మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం శాలిగౌరారం మార్కెట్ యార్డ్ లో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింత ధనుంజయ, సర్పంచ్ గుజిలాల్ శేఖర్ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాదాపు 1000 మంది భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని...