కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శలు

నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. శుక్రవారం నకిరేకల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు. నల్గొండ జిల్లాకు రావాల్సిన సాగునీటి విషయంలో అన్యాయం జరుగుతోందని, ఇతర ప్రాంతాలకు నీటిని తరలించడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లింగయ్య ఆరోపించారు. పంటలు...